అనుమానంతో భార్య ప్రైవేట్‌ పార్ట్స్‌పై యాసిడ్‌ పోసిన కిరాతకుడు

  • కొడుకు పుట్టలేదనే కోపం
  • అఫైర్ అనుమానంతో దాడి
  • 15 రోజులు ఇంట్లోనే నిర్బంధం
  • పుట్టింటికి పారిపోయిన బాధితురాలు
  • పోలీసులకు ఫిర్యాదు
అనుమానం పెనుభూతమై ఓ వ్యక్తి తన భార్యపై అత్యంత అమానుషంగా దాడికి దిగాడు. కొడుకు పుట్టలేదనే కోపంతో, పరాయి పురుషుడితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఆమె జననాంగాలపై యాసిడ్ పోసి హింసించాడు. ఆపై 15 రోజుల పాటు ఇంట్లోనే బంధించి కనీసం వైద్యం కూడా అందకుండా చేసిన భయంకర ఘటన పుణెలో వెలుగుచూసింది.

ఏప్రిల్ 20న జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ‘‘బయటకు వెళ్లినప్పుడు ఎవరితో తిరుగుతున్నావు?’’ అంటూ ఆమెను దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ తీసుకొచ్చి ఆమె ప్రైవేట్‌ పార్ట్స్‌పై పోశాడు. బాధితురాలు నొప్పితో కేకలు వేస్తూ పారిపోవాలని చూసినా తలుపులు లాక్ చేసి మరీ కొట్టాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు భార్యను బెదిరించాడు.

తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను 15 రోజుల పాటు ఇంట్లోనే నిర్బంధించాడు. మే 9న భర్త పనికి వెళ్లిన సమయంలో ఆమె తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని పుట్టింటికి పారిపోయింది. తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని వివరించింది. వారు పోలీసులను ఆశ్రయించారు. మే 15న కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను చికిత్స కోసం పుణెలోని ఆసుపత్రికి తరలించారు.

Pune Acid Attack
Acid Attack
Pune Crime
Domestic Violence India
Crime Against Women
Spousal Abuse
Gender Based Violence
Acid Attack on Wife

More Telugu News